తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్TELANGANA, INDIA
TSJU.TELANGANA STATE
JOURNALISTS UNION
The strength of a union.
The voice of journalism.
Membership ↗
TELANGANA STATE JOURNALISTS UNION

About TSJU

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU)

(Affiliated to National Union of Journalists – India / NUJ-I)

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU) అనేది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, మరియు డిజిటల్ మీడియా రంగాలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, మరియు వృత్తిపరమైన భద్రత కోసం ఏర్పాటైన స్వతంత్ర పాత్రికేయ వేదిక. దేశవ్యాప్త పాత్రికేయుల ప్రాతినిధ్య సంస్థ అయిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) – NUJ-I కి TSJU అధికారిక రాష్ట్ర అనుబంధ యూనియన్‌గా వ్యవహరిస్తోంది.

మా లక్ష్యం (Our Mission)

క్షేత్రస్థాయిలో వార్తా సేకరణలో నిమగ్నమైన ప్రతి జర్నలిస్టుకు వృత్తిపరమైన గౌరవాన్ని, సామాజిక భద్రతను అందించడం. పాలకులు, యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికమైన జర్నలిజం విలువలను కాపాడుతూ, జర్నలిస్టుల న్యాయమైన సమస్యలపై రాజీలేని పోరాటం సాగించడం మా ప్రధాన ధ్యేయం.

మా ప్రధాన ఆశయాలు & కార్యాచరణ (Core Objectives):

వ్యవస్థాగత నెట్‌వర్క్ (Organizational Network)

తెలంగాణలోని 33 జిల్లాల్లో క్రియాశీలక జిల్లా, డివిజన్ కమిటీలతో TSJU విస్తరించి ఉంది. క్షేత్రస్థాయి మండల విలేఖరి నుంచి రాష్ట్ర స్థాయి ప్రతినిధి వరకు అందరి గొంతును ఐక్యంగా వినిపించే వ్యవస్థగా ఇది పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో NUJ-I భాగస్వామ్యంతో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) మరియు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ తెలంగాణ జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావిస్తుంది.

మా నినాదం:

“జర్నలిస్టుల ఐక్యత – హక్కుల సాధన – సామాజిక సంక్షేమం!”